ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో ఒహొ...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
గుండెల్లొ గాయమేమొ చల్లంగ మానిపొయె
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధార లోన కరుగుతున్నది
నాదు సొకమోపలేక నీ గుండె బాధ పడితె తాళనన్నది
మనుషులెరుగ లేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటె స్వచ్చమైనది
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జొ
లాలి లాలి జొ
ఉమా దేవి లాలి లాలి జొ
లాలి లాలి జొ
మమకారమే ఈ లాలి పాట గా రాసేది హృదయమా నా హృదయమే
చిత్రం : గుణ
రచన : రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
Thursday, January 18, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment