మంటలు రేపే నెలరాజ
ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా
ఈ శిలపై రాలిన ఫలమేలా
ఆకాశానికి అంతుందీ
నా ఆవేదనకు అంతేదీ
ఆకాశానికి అంతుందీ
నా ఆవేదనకు అంతేదీ
మేఘములోనా మెరుపుంది
నా జీవితమందున్న వెలుగేది 11 మంటలు 11
తీగలు తెగిన వీణియపై
ఇక తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై
ఇక తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా
ఒక చిన్న గులాబి విరిసేనా 11మంటలు 11
మదిలో శాంతిలేనపుడు
ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం
నా నొసటను రాయటము మరిచాడు.11 మంటలు 11
చిత్రం : రాము
రచన : దాశరధి
సంగీతం:అర్.గోవర్ధన్
గానం : ఘంటసాల
Thursday, January 18, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment