Ads 468x60px

Saturday, January 6, 2007

ఇద్దరక్కచెల్లెళ్ళ పాట

ఇద్దరక్క చెల్లెళ్ళను ఉయ్యాలో ఊక్కూరికిస్తే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో ఒచ్చైనా పోడు ఉయ్యాలో
ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయే ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డమాయే ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండివే చీలలు ఉయ్యాలో
వెండిచీలల కింది ఉయ్యాలో వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకీ ఉయ్యాలో ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో
ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో తక్కెడపత్తి ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో ఎళ్ళనే ఆవత్తి ఉయ్యాలో
ఆపత్తి తీసుకుని ఉయ్యాలో ఏడికి పోయరి ఉయ్యాలో
పాలపాల పత్తి ఉయ్యాలో పావురాయిపత్తి ఉయ్యాలో
పాలపాల పత్తి ఉయ్యాలో బంగారుపత్తి ఉయ్యాలో
ముసల్ది వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలో
చిన్నాది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో సలెచింతల కాడ ఉయ్యాలో
సాలెచింతల కింద ఉయ్యాలో సంగడిసారెన్న ఉయ్యాలో
సంగడి సారెన్న ఉయ్యాలో సాగదీయబట్టే ఉయ్యాలో
సాగదీయాబట్టెనా ఉయ్యాలో ఆ పత్తి వడికి ఉయ్యాలో
ఆ పత్తి వడికెనా ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో
దిగెనే ఆ చీర ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో
ఆ చీర కట్తుకొని ఉయ్యాలో కొంగల బావికి ఉయ్యాలో
నీళ్ళకంటు పోతే ఉయ్యాలో కొంగలబావికి ఉయ్యాలో
కొంగలన్నీ చేరి ఉయ్యాలో కొంగునంతా చూసె ఉయ్యాలో
ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసలబావికి ఉయ్యాలో
నీళ్ళకంటు పోతే ఉయ్యాలో హంసలబావికి ఉయ్యాలో
హంసలన్ని చేరి ఉయ్యాలో ఆంచంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకొని ఉయ్యాలో పట్నంబు బోతినో ఉయ్యాలో
పట్నంబు పారినే ఉయ్యాలో కొంగుబంగారమే ఉయ్యాలో
కొంగుబంగారమే ఉయ్యాలో ఈ చీరలున్నాయా ఉయ్యాలో
ఏసాలోళ్ళు ఉయ్యాలో నేసినారే ఈ చీర ఉయ్యాలో
దిగెనే ఆ చీర ఉయ్యాలో దివిటీలమీద ఉయ్యాలో
అన్నరో ఓయన్న ఉయ్యాలో అన్నరో పెద్దనర ఉయ్యాలో
ఏడాదికొకసారి ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఆడపిల్లానన్న ఉయ్యాలో నేను ఉన్న చూడు ఉయ్యాలో
కల్గెనె పెద్దమ్మ ఉయ్యాలో కన్నతల్లున్నదా ఉయ్యాలో
ఏడంతరాలదే ఉయ్యాలో తీరైన బతుకమ్మ ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలోపువ్వులేతెచ్చిరి ఉయ్యాలో
వారిద్దరత్తురా ఉయ్యాలో వీరిద్దరత్తురా ఉయ్యాలో
సంవత్సరానికే ఉయ్యాలో ఒక్కసారే తల్లి ఉయ్యాలో
తంగేడు పూలనే ఉయ్యాలో రాసిగా తెచ్చిరి ఉయ్యాలో
మళ్ళీరా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో

0 comments:

Post a Comment

Share

Widgets