దీప సుందరితోటి సాపత్యమా నాకు
దీప సుకుమారి దరిదాపు చనగలనా !
రంగుకోక ధరించి
రాజు రాక తపించు
నీడలను తెలివి విడ
నాడి కన నుంకించు
దీపసుందరి...
రెప్ప వాల్పక మింట
లెక్కించు చుక్కలను
అలికిడికి వులికిపడు
నలుదెసల విరగబడు !
దీపసుందరి...
నిలువంత చెవి జేసి
పిలుపు విన నోరగిలు
కటి బిగించును శిరసు
కాని లెమ్మని విసురు
దీపసుందరి...
కెవ్వుమని కిందబడు
నవ్వు నాలుక సాచు--
"రాజా" యనుచు నెగిరి
"రా రా " యనుచు కునుకు
దీపసుందరి...
వేదన సుఖాన మను
వెలుగుచు సుఖాన చను
దీపసుందరి...
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్
Thursday, April 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment