ఎంకి ఊగెను కొమ్మ వుయ్యాల ! చంద్ర
వంక వూగెను బొమ్మ వుయ్యాల !
ఏటిపై కొమ్మ నూ
యెల యెంకి అమరించె
నీటి బొమ్మ వుయాల
నెలవంక వెలయించె
ఎంకి...
ఎంకి వన్నెల చీర
నేగిరె వెన్నేల పూలు
ఎండుటాకుల గొలుసు
వెండి తీగెలు చేరె !
ఎంకి...
సిగపూలు ముంగురులు
చిరు మువల మొలనూలు
ఒకచే సదురుకొనుచు
ఒయ్యారమే వూగె !
ఎంకి...
తీగల నడుమ నూగె
దీపమై తిలకమై
పీఠమై -- ఎంకికి -- కి
రీటమై నెలవంక?
ఎంకి...
మున్నీటి యా జోడె
ఆనాటికీనాడు
ఎంకి...
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్
Thursday, April 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment