Ads 468x60px

Wednesday, April 25, 2007

యెంకి ముచ్చట్లు

యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు ?

దొడ్లి తోవకల్లె తొంగి సూడంగానే
తోటకాడే వుండు త్వరగొస్తనంటాది
యెన్నాని సెప్పేది........

యెంకి రాలేదని యేటో సూత్తావుంటె
యెనకాలగా వచ్చి యెవురవో రంటాది ?
యెన్నాని సెప్పేది...........

" సిట్టి సేబా " సాని నిట్టూర మేత్తుంటె
మాటా యినబడనట్టు మరియేదో సెబుతాది
యెన్నాని సెప్పేది ...........

"కోడి కూసేసరికి కొంపకెల్లాలి " నీ
కోసరమే సెపుతాను కోప మొద్దంటాది
యెన్నాని సెప్పేది............

" యెంత సేపున్నాను యిడిసి పెట్టలేవు
తగువోళ్ళలో మనకు తలవంపు " లంటాది
యెన్నాని సెప్పేది...........

యెన కెనక సూత్తానే యెల్లుతా వుంటాది
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

4 comments:

  1. ఓ చిన్న అనుమానం,

    మీరు వీటిని టైపు చేసినారా? లేక కాపీ పేస్టు చేసినారా?

    ReplyDelete
  2. అయ్య బాబోయ్ ..కాదండి. నేని వెతికి వెతికి సొంత డబ్బులతో పుస్తకం కొని నేనే టైపు చేసా!....ఎందుకా అనుమానం వచ్చిందసలు...

    ReplyDelete
  3. యెంకి పాటల మీద అభ్యంతరం ఉంటే నండూరి వారికి ఉండాలి కానీ..మధ్యలో ఆంధ్రభారతికి ఎందుకు ఉండాలి?
    మీ బ్లాగుకి నేను పెద్ద అభిమానిని..ఇలాంటి పాటలు ఇంకా వ్రాస్తూండండి

    ReplyDelete
  4. ఈ మధ్య కూపస్థ మండూకాలు ఎక్కువయునాయి. వారు చదివిందే ఆది, అంతం అనుకునే జనాలు ఎక్కువయ్యారు. బ్లాగర్ల బతుకే ఒక యదవ బతుకై పోయింది ఈ వెధవ పోలిసింగుతో. ఆఖరికి మహాభారతం రాస్తే వ్యాసున్ని అడిగావా అన్నట్టున్నారే.

    ReplyDelete

Share

Widgets