గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండ నీదురా కూసింత సేపు !
……………………………………………
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది
యెల్లి మాటాడిస్తే యిసిరికొడతాదీ !
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
…………………………………………...
కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,
దగ్గరగా కూకుంటే అగ్గి సూస్తాదీ !
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
……………………………………………
యీడుండమంటాది యిలు దూరిపోతాది,
యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ !
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
……………………………………………..
మందో మాకో యెట్టి మరిగించినాదీ,
వల్లకుందామంటే పాణ మాగదురా !
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
……………………………………………….
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
Wednesday, April 25, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment