Ads 468x60px

Wednesday, April 25, 2007

వొన లచ్చిమి

జాము రేతిరి యేళ జడుపు గిడుపు మాని
సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే


మెల్లంగా వస్తాది నా యెంకి !
సల్లంగా వస్తాది నా యెంకి !


పచ్చని సేలోకి పండు యెన్నెల్లోన
నీలి సీరా గట్టి నీటు గొస్తా వుంటే


వొయ్యార మొలికించు నా యెంకి !
వొనలచ్చి మనిపించు నా యెంకి !

యెంకి వస్తాదాని యెదురూగా నే బోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానే

కాలు కదపాలేదు నా యెంకి !
కరిగి నీరౌతాది నా యెంకి !

మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి

కులాస గుంటాది నా యెంకి !
కులుకు సూపెడతాది నా యెంకి !

యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి----
మల్లీ యెప్పటల్లే తెల్లారబోకుంటె---

సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ !
సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ !


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

0 comments:

Post a Comment

Share

Widgets