కలవారి గని అలంకారాలు గొనుట
పులి బోలదలిచి వాతల నింపు కొనుటె !
ఘనులు తమ సకియలను
మణులతో కై సేయ
ఆకు లలములె యెంకి
కాయె నా యిడు సరులు !
కలవారి...
ఆకుల పులపు సరులె
వే కనులలో కదిలె
మెప్పున మెరిసె కనులు
నిప్పల గురిసె మణులు !
కలవారి...
పనితన మనగ సఖులు
పనలేదనగ ఘనులు
పలువాయి సమరాల
నలిగె నాకుల సరులె !
కలవారి...
వెలవోని మా సరులు
నిలువ నీడ నొసంగి
స్వంతమటు నాచె నొక
వలపు పలుకుల వరిణె !
కలవారి...
నను గూడ నటె దాచు
మని పొగిలె నా యెంకీ !
కలవారి...
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్
Thursday, April 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment