మనకేల యెడబాటు
లనుచు నా యెంకి
వనదేవి కనబోయి
వరమందె రేయి
మనకేల....
విడిచింది నన్నింట
నడిచింది అడివంత
అడుగడుగు కనులెత్తి
ఆకసపు తల మొత్తి
మనకేల...
తొలినాటి మా కతలు
తలపోతలో యేమొ
పళ్ళెరములో పళ్ళు
తుళ్ళింత పడెనంట
మనకేల...
అచటచట మా నటన
ఆనాలు కాబోలు
కంఠహారపు వేయి
కళ్ళు సుడివడెనంట
మనకేల...
ఆ లోయ లా యేరు
లా లోకమే వేరు
సిగనగను మిన్నంత
దిగి దిగులుపడెనంట
మనకేల...
వనదేవితో గుడిని
మనివాయెనే లేదొ
యింతలో యింటిలో
యెటు చూసినా యెంకె!
మనకేల...
రచన :నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
Monday, April 30, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment