Ads 468x60px

Monday, April 30, 2007

వన దేవి

మనకేల యెడబాటు
లనుచు నా యెంకి
వనదేవి కనబోయి
వరమందె రేయి
మనకేల....

విడిచింది నన్నింట
నడిచింది అడివంత
అడుగడుగు కనులెత్తి
ఆకసపు తల మొత్తి
మనకేల...

తొలినాటి మా కతలు
తలపోతలో యేమొ
పళ్ళెరములో పళ్ళు
తుళ్ళింత పడెనంట
మనకేల...

అచటచట మా నటన
ఆనాలు కాబోలు
కంఠహారపు వేయి
కళ్ళు సుడివడెనంట
మనకేల...

ఆ లోయ లా యేరు
లా లోకమే వేరు
సిగనగను మిన్నంత
దిగి దిగులుపడెనంట
మనకేల...

వనదేవితో గుడిని
మనివాయెనే లేదొ
యింతలో యింటిలో
యెటు చూసినా యెంకె!
మనకేల...


రచన :నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

కలకలిమి

కల పూల సరు లచట
కలవేమో యంచు
కల తెలివిగనీ తోట
గాలించు యెంకీ

కలజాడ లీ మేన
నిలచెనో యంచు
అద్దాన యే మే మొ
దిద్దుకొను యెంకి

కలలోని కతలన్ని
కనబడునో యంచు
కల మిణుగురుల గన్న
కులుకు నా యెంకీ

కనిపెట్టి నే సరిగ
కల చెప్పుకొనగ
కలి కలిమిసత్తెమని
కులుకు నా యెంకీ...


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ : నవరత్న బుక్ హౌస్

నటీ నటులు

"ఎంకి నా పేరితని
కేమి లేదట వీని
నెవరెరుగ రంటా !"
"నామకా నామకుల నటనె నేడంతా"


"యుగయుగము ఒకరొకరి
తగిలినామట, చేయి
మిగిలినామంటా!"
"పగలు రేయలు సుంత పట్టుబడకుండ"

"వాలి కౌగిలి సుకము
నేలినామట చూపు
కలిపినామంటా!"
"ఆకసము భూమి యటు లంటుకోకుండ"

"ఒక్కటై సరసాల
చొక్కినామట మింటి
కెక్కినామంటా!"
"బింబ ప్రతిబింబములు వీడి విడకుండ!"

"ఇంత యెంకితో నటన
యెవ్వరోనట యీత
డెవ్వరోనట, యెంకి
రవ్వపాలంటా!"
"ప్రకృతి సుందరి జంట వరుస కెటులంట!"


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

పూల బాసలు

పూల బాసలు తెలుసు యెంకికి
తోట
పూల మనసు తెలుసు యెంకికి!

పూల మొక్కల నీటి
జాలుగని నిలుసు
పూలన్ని నీ పాటె
ఆలించె నంటాది!
పూల....

పూలంటు కాలంటి
పున్నె ముందంటాది
వగలమారీ పడుచు
నగదొడిగె నంటాది!
పూల...

తరలెత్తి పూపడవ
పరుగెత్తుతు వుంటె
దా రెంట పూ లొంగి
దణ్ణమిడె నంటాది!
పూల...

పూలతో వియ్యాలు
పూలల్లో కయ్యాలు
మానన్లె నన్నుంచి
తానె పూవౌనేమొ!
పూల...

ఎంకి కళ

ఇంక నను పిలిచేర? యింత తలిచేర?
యెంకికేగాక నా కిటా వూరా - పేరా?

నెమిలె నరుగని యరుగు
నేలచూపల దిరుగు
యెంకిదరి శ్రీనించు
యెన్నో లయల నటించు
ఇంక...

నా గోవె నన్ను నా
నా గతుల నలయించు
యెంకి కడ యిల్లాలు
యెంకి చెయ్యానాలు
ఇంక...

నే నాటు పూలంటె
నేనంటితే అంటూ---
యెంకితో సరదాలు
ఏక ననుమానాలు
ఇంక...

ఏది నే పాడినా
ఎంకి పాటె యనేరు
ఏ పదములోనైన
ఎంకి కళనె కనేరు
ఇంక...


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

Thursday, April 26, 2007

నీటి చిత్రాలు

కొంటె పటముల మీల గొనిరాసె నేడు
కోనేట కిరణాల కుంచె రేరేడు?

పరువమగు జత మీలు
పరుగులిడు రతనాలు
ఎదురు సన్నాహాలు
బెదురు బెదురు సుఖాలు
కొంటె...

సరికిసరి బేరాలు
అరకంట సరసాలు
అలలగని బింబాలు
పలటిల్లు పాశాలు
కొంటె...

నిలువబో కలువ సం
కెలల తగిలిన కాళ్ళు
వలయాల పయనాలు
కళలు వెలసిన మీలు
కొంటె...

ఎంకి కిడి బహుమతులు
యి నీటి చిత్రాలు---
అలసి మునిగెడు మీలు
ఆకాశమున దేలు !
కొంటె...

బొమ్మ వైఖరి కులికి
కొమ్మ మాడిటి కంటి
కొంటె...

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

అణకువ

ఎంతెంత దూరాన
ఎందరిలో నే నున్న...

సూటిగా నా వెనుక చూసె నా యెంకి
చురుకి నే తనవైపు

* * * * *

ఏటవల నే బోయి
యిల్లు చేరని రేయి---

ఏట దీపము పళ్ళ నిడిన నా యెంకి
వెలుగులో నే నచట మొలవవలసినదే!

* * * * *

కథ నడుమ మా జోడు
నిదుర దోగిన నాడు ---

కథ కొస తళుకుగోరి కలగనెన యెంకి
కలను నే జోరి కథలు తెలుపవలసినదే !


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

ముసి ముసులు

యెంకి జలకపు పలుకు లెచట నిడుకొందు ?
ఎంత దాచిన చెణుకు లెగురు నిందండు !

మడుగున జలకమాడ
మా నీడ అలలపై
గోరంత మా నటన
కొండంత జేసెనట!
యెంకి జలకపు...

నీలపై మా రహ
స్యాల గొని తీర తీ
రాల పరుగిడి మమ్ము
గాలె యెగతాళి యట !
యెంకి జలకపు...

మెరుపు మేఘాల మించు
సరసులను మము గాంచి
ఆకసమె వులికీ మడు
గడుగున పడినదంట !
యెంకి జలకపు...

రతనాల వేదికను ర
వల చాందినీ కింద
ముత్తెపు తలంబ్రాలు
ముసిముసుల పెళ్ళంట !
యెంకి జలకపు...

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

దీప సుందరి

దీప సుందరితోటి సాపత్యమా నాకు
దీప సుకుమారి దరిదాపు చనగలనా !

రంగుకోక ధరించి
రాజు రాక తపించు
నీడలను తెలివి విడ
నాడి కన నుంకించు
దీపసుందరి...

రెప్ప వాల్పక మింట
లెక్కించు చుక్కలను
అలికిడికి వులికిపడు
నలుదెసల విరగబడు !
దీపసుందరి...

నిలువంత చెవి జేసి
పిలుపు విన నోరగిలు
కటి బిగించును శిరసు
కాని లెమ్మని విసురు
దీపసుందరి...

కెవ్వుమని కిందబడు
నవ్వు నాలుక సాచు--
"రాజా" యనుచు నెగిరి
"రా రా " యనుచు కునుకు
దీపసుందరి...

వేదన సుఖాన మను
వెలుగుచు సుఖాన చను
దీపసుందరి...


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

బరిణె

కలవారి గని అలంకారాలు గొనుట
పులి బోలదలిచి వాతల నింపు కొనుటె !

ఘనులు తమ సకియలను
మణులతో కై సేయ
ఆకు లలములె యెంకి
కాయె నా యిడు సరులు !
కలవారి...

ఆకుల పులపు సరులె
వే కనులలో కదిలె
మెప్పున మెరిసె కనులు
నిప్పల గురిసె మణులు !
కలవారి...

పనితన మనగ సఖులు
పనలేదనగ ఘనులు
పలువాయి సమరాల
నలిగె నాకుల సరులె !
కలవారి...

వెలవోని మా సరులు
నిలువ నీడ నొసంగి
స్వంతమటు నాచె నొక
వలపు పలుకుల వరిణె !
కలవారి...

నను గూడ నటె దాచు
మని పొగిలె నా యెంకీ !
కలవారి...


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

యెంకితనము

ఆ చిత్రమునకు మెరుగు నీ చక్క దనమే !
యీ చిత్రముకు వెలుగు నీ యెంకితనమే !

కొమ్మ నొక చేయూని
గోవు నొక చేయూని
వేళ్ళు కదిపితివా నే
మళ్ళ జత దిగియాడ !
ఆ చిత్ర...

చిలుక పావురము నీ...
చేవ్రాల చెంపగొని ---
అంత ననుగని వింత
అంత మీ మువు రెగుర !
ఆ చిత్ర...

కోడె పసిలేడి నడి
కోన నిను పసిగట్టి
"నేను నే"నని యురికి
నిను తాకి కనుమూయ !
ఆ చిత్ర...

యేట కను చాటొనగ---
తోట నీడల తెరలు
నాటి వెన్నెల నావ
నా నీ-మరువ !
ఆ చిత్ర...


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

చిలుక పలుకు

ఎకసకె మెవరికి తెలుసు ?
ఎంకి చిలుక మనసు గడుసు !

"పేరంటము పిలిచి తోట
చూర విడుతె" యన నేనన ---
చిలుకను పురికొలిపి నన్ను
"బలిరాజా" యనిపించిన
ఎకసకె...

గాయపడిన లేగకు నే
సాయమిడకె సాగిపోవ
చిలుకను పుసిగొలిపి నన్ను
"శిబిరాజా" యనిపించిన
ఎకసకె...

కలలో తల సెలవులేకె
కానలబడి పోతినేమో---
మెలకువగని చిలుక బిలిచి
"నలరాజా" యనిపించిన
ఎకసకె...

పూలను గద్దియ నమరిచి
బూల కిరీటము కూరిచి
"రాజా"యని తానె కోరు
"రాణి" తన మనుకొంటిని !
ఎకసకె...

ఎగతాళియు యెంతో సొగసు
ఎంకి చిలుక మనసె మనసు !
ఎకసకె...


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

చెర

కరములు సిరులు పరుల కారింపవా?
యెంకి
రను తెత్తి నా రాజు గతు లెరుగునా !

నా రాజు కగు శయ్య
రే రాజు చేరె నని
శయ్య సదురును యెంకి
చంద్రు గని కనులార్చు
కరములు సిరులు...


పానుపున మా బోటి
పవళింపు భావించు
వెచ్చ వెచ్చని పాన్పు
నే విధుల లాలించు?
కరములు సిరులు...

తనను వెన్నెల సోక
తప్పువలె కోపించు
"రాజు పనగను రాజు
రాడ?" యని తలయూచు !
కరములు సిరులు...


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

రేవెలుగు

ఎవరైన యెపుడైన యేవాడనైన
యింత జాలి గనేర యెంకి చిత్రాలు?

మెయిలు జోరె చంద్రుడని
భయపు మిష నా యెంకి
పూ సజ్జె నా పజ్జ
పోగుపడ -- ఆరటము !
ఎవరైన యెప్పుడైన

మబ్బు వెలువడు చంద
మామ గని, తన చీర
చెరగు మాటిడి నన్ను
జీరు సిగ్గరితనము !
ఎవరైన యెప్పుడైన

కళ్ల ములుకులు దించె
కంఠపాశము లేసె
తరి యనెను ఆకులము
కిరణాలు నువులేని !
ఎవరైన యెపుడైన

దృష్టి తొలగగ తనను
తిలకముగ నే గొనిన
నెలవంక నా రాజు
తులయె యను అతిశయము !
ఎవరైన యెపుడైన

రే వెలుగు గీ వెలుగు
నా వెనుక యడు మతము ! ఎవరైన యెపుడైన

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

ఉయ్యాల

ఎంకి ఊగెను కొమ్మ వుయ్యాల ! చంద్ర
వంక వూగెను బొమ్మ వుయ్యాల !

ఏటిపై కొమ్మ నూ
యెల యెంకి అమరించె
నీటి బొమ్మ వుయాల
నెలవంక వెలయించె
ఎంకి...

ఎంకి వన్నెల చీర
నేగిరె వెన్నేల పూలు
ఎండుటాకుల గొలుసు
వెండి తీగెలు చేరె !
ఎంకి...

సిగపూలు ముంగురులు
చిరు మువల మొలనూలు
ఒకచే సదురుకొనుచు
ఒయ్యారమే వూగె !
ఎంకి...

తీగల నడుమ నూగె
దీపమై తిలకమై
పీఠమై -- ఎంకికి -- కి
రీటమై నెలవంక?
ఎంకి...

మున్నీటి యా జోడె
ఆనాటికీనాడు
ఎంకి...


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

Wednesday, April 25, 2007

యెంకి ముచ్చట్లు

యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు ?

దొడ్లి తోవకల్లె తొంగి సూడంగానే
తోటకాడే వుండు త్వరగొస్తనంటాది
యెన్నాని సెప్పేది........

యెంకి రాలేదని యేటో సూత్తావుంటె
యెనకాలగా వచ్చి యెవురవో రంటాది ?
యెన్నాని సెప్పేది...........

" సిట్టి సేబా " సాని నిట్టూర మేత్తుంటె
మాటా యినబడనట్టు మరియేదో సెబుతాది
యెన్నాని సెప్పేది ...........

"కోడి కూసేసరికి కొంపకెల్లాలి " నీ
కోసరమే సెపుతాను కోప మొద్దంటాది
యెన్నాని సెప్పేది............

" యెంత సేపున్నాను యిడిసి పెట్టలేవు
తగువోళ్ళలో మనకు తలవంపు " లంటాది
యెన్నాని సెప్పేది...........

యెన కెనక సూత్తానే యెల్లుతా వుంటాది
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

వొన లచ్చిమి

జాము రేతిరి యేళ జడుపు గిడుపు మాని
సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే


మెల్లంగా వస్తాది నా యెంకి !
సల్లంగా వస్తాది నా యెంకి !


పచ్చని సేలోకి పండు యెన్నెల్లోన
నీలి సీరా గట్టి నీటు గొస్తా వుంటే


వొయ్యార మొలికించు నా యెంకి !
వొనలచ్చి మనిపించు నా యెంకి !

యెంకి వస్తాదాని యెదురూగా నే బోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానే

కాలు కదపాలేదు నా యెంకి !
కరిగి నీరౌతాది నా యెంకి !

మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి

కులాస గుంటాది నా యెంకి !
కులుకు సూపెడతాది నా యెంకి !

యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి----
మల్లీ యెప్పటల్లే తెల్లారబోకుంటె---

సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ !
సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ !


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

ముద్దుల నా యెంకి

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

కూకుండ నీదురా కూసింత సేపు !

……………………………………………


నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది

యెల్లి మాటాడిస్తే యిసిరికొడతాదీ !

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ


…………………………………………...కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,

దగ్గరగా కూకుంటే అగ్గి సూస్తాదీ !

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

……………………………………………యీడుండమంటాది యిలు దూరిపోతాది,

యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ !

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

……………………………………………..మందో మాకో యెట్టి మరిగించినాదీ,


వల్లకుందామంటే పాణ మాగదురా !

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

……………………………………………….

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

Saturday, April 21, 2007

ఈ మౌనం ఈ బిడియం

ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం

ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక

ఈ మౌనం||

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక అహ ఒహొ అ...
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువరించు ప్రణవ భావ గీతిక

ఈ మౌనం||

ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక

ఈ మౌనం||

చిత్రం : డాక్టర్ చక్రవర్తి
గానం : ఘంటసాల,సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం: ఎస్.రాజేశ్వర్ రావు

నీ మది చల్లగా

నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలొ వేదన మరచిపో

యే సిరులెందుకు యే నిధులెందుకు యే సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే
నీ మది

చీకటి ముసిరినా వేకువ ఆగునా యే విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలుచుకో
నీ మది

జానకి సహనము రాముని సుగుణము యే యుగమైనను ఇలకే ఆదర్శము
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము
నీ మది

చిత్రం : ధనమా ధైవమా
గానం : సుశీల
రచన: సి.నారాయణరెడ్డి

జగమే మాయ

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా

జగమె||

కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి

జగమె||

ఆశా మోహముల దరిరానీకోయి
ఆశా మోహముల దరిరానీకోయి
ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
బాధే సౌక్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
బాదే సౌక్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్

జగమె||

చిత్రం : దేవదాసు
గానం : ఘంటసాల
రచన: సీ.సముద్రాల
సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్

యమునా తటిలో

యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా
యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా

రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగ బంధమె లేదే
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగ బంధమె లేదే

యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో
యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో...పాపం రాధా

యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా


చిత్రం : దళపతి
గానం : చిత్ర
రచన: రాజశ్రీ
సంగీతం:ఇళయరాజా

అందాల పసిపాప

అందాల పసిపాప అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కధలెన్నో చెపుతాలే కలలన్ని నీవేలే...

మీ నాన్న వస్తున్నారు యేమేమో తెస్తున్నారు
వంశం నిలిపే తొలి కాంపువని -2
గారాబాలే కురిపించేరు
మా ఇద్దరి ముద్దుల రాజా నా మదిలొ పూసిన రోజా
ఇంతై అంతై ఎంతో చదివి -2
నీ వన్నిట నాన్నను మించాలి

అల్లుడవని మీ మామయ్య పిల్లను కని నీకిస్తాడు
రవ్వలవంటి నీ పిల్లలను -2
అమ్మను నేనై ఆడిస్తాను
లల లలె లలలి లల లలె లలలి

చిత్రం : చిట్టి చెల్లెలు
గానం : సుశీల
రచన :దాశరథి

తోటలోకి రాకురా

తోటలోకి రాకురా తుంటరి తుమ్మెద గడసరి తుమ్మెద
మా మల్లి మనసెంతో తెల్లనిది అది యే వన్నెలె చిన్నెలెరుగనిది


కన్ను సైగ చెయకురా కామిని చోర
గోపికా చార
మా రాధ అనురాగం మారనిది
అది ఈ రాసకేళిలోన చేరనిది

జిలుగు పైట లాగకురా
తొలకరి తెమ్మెరా చిలిపి తెమ్మెరా
కన్నె సిగ్గు మేలి ముసుగు వీడనిది
అది ఇన్నాళు ఎండ కన్నెరుగనిది

రోజు దాటి పోగానే జాజులు వాడునురా
మోజులు వీడునురా
కన్నెవలపు సన్నజాజి వాడనిది
అది ఎన్ని జన్మలైనా వసి వాడనిది

చిత్రం : బుద్ధిమంతుడు
గానం : సుశీల
రచన : సి.నారాయణరెడ్డి

నీలకంధరా దేవా

జయజయ మహాదేవా శంభో సదాశివా
ఆశ్రిత మందార శృతిశిఖర సంచారా

నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా
సత్యసుందరా స్వామి నిత్య నిర్మల పాహి
సత్యసుందరా స్వామి నిత్య నిర్మల పాహి

అన్యదైవము గొలువా ఆ
అన్యదైవము గొలువా
నీదుపాదము విడువా
అన్యదైవము గొలువా
నీదుపాదము విడువా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా

దేహి అన వరములిడు దానగుణసీమ
పాహియన్నను మ్రొక్కి నిన్ను పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణ
ఏమరక చేయుదును భవతాప హరణ
నీ దయామయ దృష్టి సురితమ్ములార
వరసుభావృత్తి నా వాంఛ నీవేరా
కరుణించు పరమేశ దరహాస భాసా
హరహర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా

ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా


చిత్రం : భూకైలాస్
గానం : ఘంటసాల
సంగీతం:సీ.సముద్రాల

పచ్చని చిలుకలు తోడుంటే

తందానానె తానానె ఆనందమే (4)
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే...అరె
చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకా చిలుకకు చీరలెందుకు...అరె
ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట

పచ్చని చిలుకలు||

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం...అరె
ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం...చెలియ
వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం

పచ్చని చిలుకలు||

నీ శ్వాసను నేనైతే...నా వయసే ఆనందం
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం...నా
చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం...చెలియా
ఇతరులకై కను జారే కన్నీరే అనంద మానందం

పచ్చని చిలుకలు||

చిత్రం : భారతీయుడు
రచన: భువనచంద్ర
గానం : యేసుదాస్
సంగీతం:ఎ.ఆర్.రెహ్మాన్

ఊహలు గుస గుసలాడే

ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే

వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
తొలి ప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు

నను కోరి చేరిన బేల
దూరాన నిలిచే వేల
నీ ఆనతి లేకున్నచొ విడలేను ఊపిరి కూడ

దివి మల్లె పందిరి వేసే
భువి పెళ్ళి పీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసె

చిత్రం: బందిపోటు
గానం : సుశీల

మూసిన ముత్యాలకేలే

మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు

కందులేని మొమునకేలే కస్తురి చిందుని కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే పైకమ్మని నీమేనికి

మూసిన||

ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

మూసిన||

చిత్రం : అన్నమయ్య
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర
రచన: అన్నమయ్య కీర్తన
సంగీతం: కీరవాణి

ఉరకలై గోదావరి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హౄదయానికి సృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి

నీ ప్రాణ భావం నా జీవ రాగం
నీ ప్రాణ భావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల పరలోకమె మనదైనది

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది


చిత్రం: అభిలాష
గానం : ఎస్.జానకి
రచన:వేటూరి

పట్టి తెచ్చానులే

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
యేది యేది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని

మనసున సెగ యెగసే ఏ మాయ వెలుపుల చలి కరిచే
వయసుకు అదివరసా వరసైన పిల్లదానికి అది తెలుసా
మాపటికి చలిమంటేస్తా కాచుకో కాస్తంతా
ఎందుకే నను ఎగదోస్తా అందుకే పడి చస్తా
చింతాకుల చీర గట్టి పూచింది పూదోట
కన్నే పువ్వు కన్ను కోడితే తుమ్మెద పువ్వు దొంగాటా
దోబూచిలే నీ ఆటా

పొద్దుంది ముద్దులివ్వనా ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్ని విప్పి చూడనా
చూసాక మూట కట్టి లెక్క చెప్పనా
నోటికి నోరు అయితేనే కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే కోరికలే కొసరేనా
నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాత్రి అయింది రాసుకుంది చిటపట గా చిరు నిప్పు
అరె పోవే పిల్లా అంటా డూపు

చిత్రం: ఆత్మబంధువు
గానం : ఎస్.జానకి

Friday, April 20, 2007

తోలి వలపే పదే పదే పిలిచే

తోలి వలపే పదే పదే పిలిచే యేదలో సందడి చేసే
తోలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లేలు విరిసే

తొలి||

ఆ ఆ ఆ
ఎమో ఇది ఎమో నీ పేదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం నా మనసున మీకై దాచిన పూసిన కానుకలు
ఎమో ఇది ఎమో నీ పేదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం నా మనసున మీకై దాచిన పూసిన కానుకలు
నీ కన్నుల వేలిగెనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతి రూపాలు
నీ కన్నుల వేలిగెనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతి రూపాలు
మన అనురాగానికి హారతులు

తొలి||

దరినిరిగ ఆ
మదరిగమా ఆ
గమ నీద నీద మ ఆ
ఏల ఈ వేల కడు వింతగ దోచే తీయగ హాయిగ ఈ జగము
యవ్వనము అనుభవము జత కూడిన వేల కలిగిన వలపుల పరవశము
ఏల ఈ వేళ కడు వింతగ దోచే తీయగ హాయిగ ఈ జగము
యవ్వనము అనుభవము జత కూడిన వేల కలిగిన వలపుల పరవశము
ఈ రేయి పలికెనే స్వాగతము
ఈ నాడే బ్రతుకున సుభదినము
ఈ రేయి పలికెనే స్వాగతము
ఈ నాడే బ్రతుకున శుభదినము
ఈ తనువే మనకిక చేరిసగము

తొలి||


చిత్రం : దేవత
గానం : ఘంటసాల, సుశీల
రచన : వీటూరి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి

గోరంకకెందుకో కొండంత అలక

గోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకా

గోరంక||

కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది
కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే

గోరంకకెందుకో||

మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
ఆదమరచి అక్కడే హాయిగా నిదరపో

గోరంక||

చిత్రం : దాగుడు మూతలు
గానం :సుశీల
రచన: దాశరథి
సంగీతం:కె.వి.మహదేవన్

ఆవేశమంతా ఆలాపనేలే

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే
ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జలించే స్వరాల

ఆవేశమంత||

నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస
అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన
జర్దరతల నాట్యం అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మదువులడిగే గానం
నిదురలేచె నాలో హృదయమే

ఆవేశమంత||

సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగస గమగమ నిసనిస గమగపదనిస
వనకన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలిసంజ కన్న
అందాలు కరిగే ఆ వేదన నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురివిడిన నెమలిఫించం
ఎదలు కలిపి నాలో విరిపొదలు వెతికే మోహం
బదులులెని ఏదో పిలుపులా

ఆవేశమంత||


చిత్రం : ఆలాపన
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన :వేటూరి సుందర్‌రామ్మూర్తి
సంగీతం: ఇళయరాజా


powered by ODEO

Thursday, April 19, 2007

చూకర్ మెరె మన్‌కో

చూకర్ మెరె మన్‌కో కియతూనే క్యా ఇషారా
బద్లా యె మౌసం లగె ప్యారా జగ్ సారా

తూ జో కహె జీవన్ భర్ తేరే లియే మై గావూ
తేరే లియే మై గావూ
గీత్ తెరె బోలోన్ పె లిఖ్తా చలా జావూ
లిఖ్తా చలా జావూ
మేరే గీతో మే తుఝె ఢూండే జగ్ సారా
చూకర్ మెరె మన్‌కో కియతూనే క్యా ఇషారా
బద్లా యె మౌసం లగె ప్యారా జగ్ సారా
చూకర్ మెరె మన్‌కో కియతూనే క్యా ఇషారా


ఆజా తేరా ఆంచల్ యే ప్యార్ సే మై భర్ దూ
ప్యార్ సే మై భర్ దూ
ఖుషియా జహా భర్ కీ తుజ్కో నజర్ కర్ దూ
తుజ్కో నజర్ కర్ దూ
తూ హి మేరా జీవన్ తూ హీ జినే క సహారా
చూకర్ మెరె మన్‌కో కియతూనే క్యా ఇషారా
బద్లా యె మౌసం లగె ప్యారా జగ్ సారా
చూకర్ మెరె మన్‌కో కియతూనే క్యా ఇషారా

చిత్రం ; యారానా
గానం: కిషోర్ కుమార్

Listen This Song on Gayaki
Share

Widgets