Ads 468x60px

Friday, August 8, 2008

స్వప్నవేణువేదో..




స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ
కాలేవా చేతి రాతలు

స్వప్నవేణువేదో

నీవే ప్రాణం.. నీవే సర్వం..
నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ.. రేయీ పగలూ..
హారాల్లల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు
నిన్ను చూచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా
కాలాలే ఆగిపోయినా.. గానాలే మూగబోవునా..

నాలొ మోహం.. రేగే దాహం..
దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం.. గెలిచే బంధం
రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా
మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం
వాలేదే ప్రణయ గోపురం

ll స్వప్నవేణువేదో ll

చిత్రం : రావోయి చందమామ
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. చిత్ర
రచన: వేటూరి
సంగీతం : మణిశర్మ

0 comments:

Post a Comment

Share

Widgets