జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి.. మెరుపులా.. ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
వాగులూ వంకలు జలజల చిలిపిగా పిలిచినా
గాలులూ వానలు చిటపట చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదూ అదేమి తాకిడో
కొండచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
వెళ్ళదాయె కళ్ళులేని దేవుడెందుకో మరి
II జల్లంత II
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలిపె నీ మనసులే తెలియని తపనలే తెలుపగ
వానదేవుడె కళ్ళాపి జల్లగ వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్తపాట పుట్టుకొచ్చె ఎవరికొసమో
II జల్లంత II
చిత్రం : గీతాంజలి
గానం : చిత్ర
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా
Saturday, August 30, 2008
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment