Ads 468x60px

Wednesday, August 27, 2008

మనసున మనసై ..మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము..
II మనసు II

ఆశలు తీరని ఆవేశములో..
ఆశయాలలో.. ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము.
అదే స్వర్గము

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమే కనీరు నింపుటకు -2

నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము

చెలిమియె కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిలయై పోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము
II మనసున II

చిత్రం : డాక్టర్ చక్రవర్తి
గానం : ఘంటసాల
రచన : శ్రీ శ్రీ
సంగెతం : ఎస్.రాజేశ్వర రావు

0 comments:

Post a Comment

Share

Widgets