Friday, August 8, 2008
జాబిల్లి కోసం ఆకాశమల్లే..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను చేరలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకెక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలి ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి
జాబిలి కోసం
నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది
ఎన్నళ్ళయినా
ఉండి లేకా ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నా నీడ నాదే
నాకున్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
చిత్రం : మంచిమనసులు
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : వేటూరి
సంగీతం: ఇళయరాజా
Subscribe to:
Post Comments (Atom)
this is by athreya gaaru..........
ReplyDeleteplease correct
and .......good work........keep it up........tc