Friday, August 8, 2008
లాహిరి లాహిరి లాహిరిలో...
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో! జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే
పిల్ల వాయువుల లాలనలో
ll లాహిరి ll
అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో మిలమిలలో
అలల ఊపులో తీయని తలుపులు
చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమనౌకలో
హాయిగ చేసే విహరణలో
ll లాహిరి ll
రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో మధురిమలో
రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే
చల్లని దేవుని అల్లరిలో
ll లాహిరి ll
చిత్రం : మాయాబజార్
గానం : ఘంటసాల, పి.లీల
రచన: పింగళి
సంగీతం: ఘంటసాల
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment