తొలి ప్రొద్దు కొండపై మొలిచెనొక దేవళము
వెలుగు గుడి మొగసాల నిలిచె యాత్రా జలము
చ కోన కోనల గాలి కొసలూర్చె నానందం
కోనేటిలో దమ్మి క్రుమ్మరించె మరందం
చ ఆలయమ్మున గంట ఆదరించె నాహ్వానం
ఆలకించిన పికము లాలపించెను ప్రణవం
చ గుడిని శంఖము మొరసె విడెను వాకిటి ద్వారం
ఎడద ఎడను నిండె గుడినుండి మా దైవం
రచన దేవులపల్లి కృష్ణశాస్త్ర్రి
తాళం: ఖండ
గానం పాలపర్తి (దేవరకొండ) పద్మకాంతి
పంపిన వారు: మూర్తి
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment