Ads 468x60px

Thursday, December 28, 2006

రేయి గడిచె ప్రొద్దు పొడిచె

రేయి గడిచె పొద్దు పొడిచె
నాదు ప్రయాణమ్ము ముగిసె
అదుగదుగో వినిపించెను
తీయనైన వెలుగు పాట


చ. ధన్యుడవో యాత్రికుడో
జాగరమున ననసి రజని
ధన్యమయ్యె ఈనాటికి
ధూళి ధూసరిత హృదయము


చ. అటవీ పర్యంకమందు
సమీరణము మేల్కొనియెను
ప్రతి కుంజ ద్వారమ్మున
తేనెలకై మూగె తేంట్లు


చ. నీ ప్రయాణమంతమయ్యె
తుడిచి కొమ్ము కంట నీరు
తొలగెను లజ్జా భయములు
అహంకార మంతరించె

రచన రజని
తాళం: రూపక
గాయని సునందా కృష్ణమూర్తి
పంపిన వారు: మూర్తి

1 comments:

  1. ఈ గీత రచయిత శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు అనుకుంటా నండి

    ReplyDelete

Share

Widgets