నీ జాడ కననైతిరా నా స్వామి
రేరేడు శయనించెరా, నా స్వామి
చ. పూల మోవులలోని మేని తాలిలలోని
గాలి ఈలలు వేసెరా, నా స్వామి
చాల వేడిగ వీచెరా, నా స్వామి
చ. వేయి కన్నుల తోడ వేచి వేచిన కలువ
విసిగి కన్నులు మూసెరా, నా స్వామి
నెలది వెన్నెల మాసెరా, నా స్వామి
చ. దూరాల జలదాన దూరేటి నెలబాల
ఏలకో హసియించెరా, నా స్వామి
ఎగతాళి అనిపించెరా నాస్వామి
రచన సి. నారాయణ రెడ్డి
తాళం ఖండ జాతి త్రిపుట
గానం పాలపర్తి (దేవరకొండ) పద్మకాంతి
పంపిన వారు: మూర్తి
Thursday, December 28, 2006
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment