Ads 468x60px

Thursday, December 28, 2006

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు


చ కల విహంగమ పక్షముల తేలియాడి
తారకామణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నా మధుర గానమున


చ మొయిలు దోనెలలోన పయనంబొనర్చి
మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
పాడుతు చిన్కునై పడిపోదు నిలకు


చ తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాలనాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి

రచన దేవులపల్లి కృష్ణశాస్త్ర్రి
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
రాగం కల్యాణి
సంగీతం : కె.వి.రమణమూర్తి
తాళం : ఖండ
పంపిన వారు: మూర్తి

0 comments:

Post a Comment

Share

Widgets