సూర్యుడొచ్చాడమ్మా సూర్యుడొచ్చాడూ
సొగసైన కిరణాల మాలతెచ్చాడూ (సూ)
చ. తోటలన్నీ తిరిగి తొంగిచూశాడూ
పేటలన్నీ నడచి పలకరించాడూ
వాడిపోయిన పేద లతలనే కదిపి
పసిడి రేకుల పూలు పూయించినాడు
చ. పూరింటిలో గడప పొదిగిటను నిలచి
పొంగు ఆకటికంటి నీరు తుడిచాడు
అలకలల్లన రేగి ధూళిలో దోగి
పిల్లగాళ్లకే కొత్త కలలనిచ్చాడు
చ. మిన్ను మిన్నంతట కనుల పండువుగా
మేళాలు తాళాలు మ్రోగుతున్నాయి
పుట్టు సిరివారల మాలలే కోరగా
మట్టి మనిషికి తానె అందించినాడు
రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం ఎం. ఎస్. శ్రీరాం
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
తాళం రూపక
పంపిన వారు: మూర్తి
Thursday, December 28, 2006
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment