ఆనాటి నీపాట ఎదను తాకి గుబులు రేపు
ఏనాటికి మరువలేని వేదనలో సేద దీర్చు
చ. మరు మల్లెల పొద ల మారి తెరి వెన్నెల తెరల కరిగి
కమ్మని తెమ్మెరద సోకి కమ్మని దూరాలు సాగు
చ. నిన్నలన్ని కనులు సాచి నిట్టూర్పుల రగిలిపోయె
స్వరమాధురి ఊపిరిగా నేడు రేపు దొరలిపోవు
చ. మూసిన నా కనుల వెనుక ముగిసిన కథలేవొ కదిలి
కమ్మని పాటలకు కరిగి కన్నీరుగ జారిపోవ
రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
తాళం రూపక
పంపిన వారు: మూర్తి
Thursday, December 28, 2006
Subscribe to:
Post Comments (Atom)
జ్యోతిగారు
ReplyDeleteలలిత గీతాలు చూసి చాలా సంతోషమైంది. ఈ మూర్తిగారు ఎవరు? మాక్కూడా పరిచయం చేయగలరా? ట్యూన్లు పెడితే బాగుంటుంది. నాక్కొన్నిటికి మాత్రమే సుమారుగా తెలుసు.
నాకు తెలీదండి. ఒక సారి రచ్చబండలో అనుకుంటా లలితగీతాల గురించి చర్చ జరుగుతుంటే అడిగా . పంపించారు.ట్యూన్లు దొరకలేదు.ప్రయత్నించా.
ReplyDelete