శ్రావణాన మధురమైన వలపు తలపు తేనె సోన
మనసు లోన కరిగినంత వలపంతా పులకింత
చెప్పవేలనే కాంతా
చ. బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే
నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే
చ. తరుల తేరు వాడెనటే వరుని జాడ తెలియదటే
ఒక్కమారు చాతకమై రెక్కలార్చు కొందువటే
చ. బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే
నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే
రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం దేవరకొండ సీతాదేవి
గానం దేవరకొండ సీతాదేవి
తాళం రూపక
పంపిన వారు: మూర్తి
Thursday, December 28, 2006
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment