పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కదిపేసినాది!
ఎడతెగని జలమంట
నడమనో పడవంట!
పడవెక్కి నా యెంకి పయన మయ్యిందంట!
పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కదిపేసినాది!
యెంకేటో బ్రమ పుట్టి
యెనక తిరిగిందంట!
సందెగాలికి పడవ సాగిపోయిందంట
పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కదిపేసినాది!
నీటి గాలికి యెంకి
పైటెగురుతాదంట!
పడిపోయి నట్టేటో పడవెల్లి నాదంట!
పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కదిపేసినాది!
పిల్ల సిగలో పూలు
కళ్ళిప్పినాయంట!
మిడిసిపాటు దోనె మీరిపోయిందంట!
పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కదిపేసినాది!
మెడసాటు వూసోటి
మినుకుమంటాదంట!
పంతాన గంతేసి పడవ పోయిందంట
పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కదిపేసినాది!
అంసల్లె బొమ్మల్లె
అందాల బరిణల్లె
సుక్కల్లె నా యెంకి సురిగిపోయిందంట!
పడుకుంటే నాకేటో బ్రమ పుట్టినాది!
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
Saturday, June 16, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment