Ads 468x60px

Friday, June 15, 2007

పంట సేలకే పయనం

యీ యేపునో యావు ఆ యేపునో యావు
జోడావులకు నడుమ నా యెంకి
యూడు
జోడుగా నిలుసుంటె నా యెంకి
ఆట
లాడతా కలిసుంటె నా యెంకి
నన్నె
సూడుమన్నట్లుండు నా యెంకి!

యీ యేపునో యేరు ఆ యేపునో యేరు

యేళ్ళ రెంటికి నడుమ నా యెంకి
తలను
పాలకడ వెత్తుకొని నా యెంకి
సేత
పూలు పుణుకుకొంట నా యెంకి
నన్నె
పోలుండుమంటాది నా యెంకి

యీ కాడనో కొండ ఆ కాడనో కొండ

కొండ కోనల నడుమ నా యెంకి
పాల
కుండ దించుకొని నా యెంకి
గుడికి
దండ మెడతా వుంటె నా యెంకి
సూడ
రెండేళ్ళ కనుపించు నా యెంకి!

యీ సాయనో సేను ఆ సాయనో సేను
సేల రెంటికి నడుమ నా యెంకి
పాలు
పూలు నా కందిచ్చి నా యెంకి
సొమ్ము
లేన మన కంటాది నా యెంకి
గుండె
జాలి పుట్టిస్తాది నా యెంకి!

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

0 comments:

Post a Comment

Share

Widgets