మనిసే సాలు ! మనిసి మాటే సాలు!
మనిసి వోసనే సాలు! మనిసే సాలు!
ఏతాము కెదురుంగ యెంకుంటే సాలు!
వొంటరిగ సిటికేసి కుంట కలిపేను!!
మనిసే సాలు ! మనిసి మాటే సాలు!
మనిసి వోసనే సాలు! మనిసే సాలు!
యెంకి అందెల గలగ లినబడితె సాలు!
కళ్ళు మూసుకు నీరు మళ్ళ కెత్తేను!!
మనిసే సాలు ! మనిసి మాటే సాలు!
మనిసి వోసనే సాలు! మనిసే సాలు!
యెంకి గా లొకసారి యిసిరినా సాలు!
తోటంత రాజల్లె తొవ్వి పోసేను!!
మనిసే సాలు ! మనిసి మాటే సాలు!
మనిసి వోసనే సాలు! మనిసే సాలు!
అందాల నా యెంకి వుందంటె సాలు
నిబ్బరముగా రేత్రి నిదురపొయ్యేను!!
మనిసే సాలు ! మనిసి మాటే సాలు!
మనిసి వోసనే సాలు! మనిసే సాలు!
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్
Friday, June 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment