కటిగ్గుండెల నా యెంకి

నీ వెల్లిప్యినావంటే
పచ్చినై
నేనెటో కొట్లాడుతుంటే
యిరుగమ్మలక్కలతో నీవా
నా యెంకి,


యెకసక్కె మాడుతున్నావా!
నిన్ను రచ్చించమంటానే
పద్దాక,
యెన్నో దణ్ణాలు పెట్టేనే!
వొన్నె సీరలు గట్టి నీవా
నా యెంకి,


వోసుగా తిరుగుతున్నావా!
పొద్దత్తమానాలు కాదే
నీ వూసె,
వొద్దన్ననూ మరపురాదే!
అమ్మలక్కలతోటి నీవా
నా యెంకి,


సెమ్మ సెక్కలాడుతునావా!
రేతిర్లో మన తోటకాడా
వొక్కణ్ణి,
నా తిప్ప లీశ్వరుడు లేడా!
సీకు సింతా లేక నీవా,
నా యెంకి,
పోకల్లె పొండు తున్నావా!


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

గమనిక

బ్లాగు సార్వజనీక ఉపయోగార్థం వ్రాయబడినది, ఇందులోని విషయాల కాపీరైటు ఆయా పోస్టులలో చెప్పబడిన వారికి చెందినది అయి ఉండ వచ్చు, . ఏదైనా పోస్టులపై ఏమైనా అభ్యంతరాలున్నచో ఓ కామెంటు వ్రాయగలరు.

రసజ్ఞులు

వర్గాలు

తెలుగు వెలుగులు