Ads 468x60px

Saturday, June 16, 2007

తోట వూసు

తోట వూసంటే సీకాకూ
యెంకి......

తోటి యెల్లే దాని సోకూ!
బంతి సేమంతట్ల
పరువంతా సూసింది
మల్లెంటు మెల్లంగ
మారుమొగ్గ మేసింది

తోట వూసంటే సీకాకూ
యెంకి......

తూర్పేపు మళ్ళేటి
దుబ్బు దుట్రా యేటి
అంటు మామిళ్ళేటి
ఆ వొరస పళ్ళేటి!

తోట వూసంటే సీకాకూ
యెంకి......

గొడ్డూ గోదా బెంగ
గొని సిక్కి పోనాయి!
గడ్డిమేటిని సూత్తె
కడుపె సెరువౌతాది!

తోట వూసంటె సీకాకూ
యెంకి.......

నూతికాడే సోకు
యేతాముదే సోకు!
పోయి "పాడో"యంటె
"వో" యంట పలికేని!

తోట వూసంటే సీకాకూ
యెంకి

బలము సీదాపోయి
బడుగునై పోనాను!
కృష్ణా రామా యంట
కూకోవాలి సొచ్చింది

తోట వూసంటే సీకాకూ
యెంకి.......


రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

0 comments:

Post a Comment

Share

Widgets