Ads 468x60px

Thursday, June 28, 2007

పాప్ నేస్తాలు

కాకి

మదుర గోడ మీద
కుదురుగా కూర్చొని
కావుఁ కావుఁ మంటు
కేక లేసేవా?

బుజ్జి పాపల వద్ద
బువ్వ అడిగేవా?

ఉడుత

ఇంటి కప్పు పైన
ఉడతమ్మ నువ్వు
గంతులేస్తు బలె
గల్లంతు చేసేవా?

బుజ్జి పాపల వద్ద
పరుగు నేర్చేవా?

నెమలి

నీలి ఈకల జిలుగు
మేలి ముసుగు కాగ
మేఘాలు మురుస్తూ
నాట్యమాడేవా?

బుజ్జి పాపల వద్ద
ఆడ నేర్చేవా?

కోయిల

కొమ్మపై కూచున్న
కోయిలమ్మా నువ్వు
మావి చిగుల్లు మెక్కి
మైమరచి వున్నావా?

బుజ్జి పాపల వద్ద
పాడనేర్చేవా?

చిలుక

చెట్టు కొమ్మ పైన
చిలకమ్మా నువ్వు
పండ్లన్నీ కొరుకుతు
విందారగించేవా?

బుజ్జి పాపల వద్ద
పలుక నేర్చేవా?

చేప

నీటిలో కులికేటి
నిగ నిగల చేపా
నీరెండ వేళలో
స్నానమాడేవా?

బుజ్జి పాపల వద్ద
ఈద నేర్పేవా?

సీతాకోక చిలుక

రంగు రంగుల చీర
రమ్యంగ ధరియించి
రెక్కలాడించుతూ
రివ్వుమని వెళ్ళేవా?

బుజ్జి పాపల వద్ద
ఎగుర నేర్చేవా?

రచన : ఆచార్య మహాసముద్రం దేవకి

0 comments:

Post a Comment

Share

Widgets