ఉత్తమా యిల్లాలి నోయీ!
నన్నుసురు పెడితే దోస మోయీ!
నిదరలో నిను సూసి సెదిరే నేమో మనసు!
పొరుగు పోరంత నా సరస కురికారంట!
ఉత్తమ యిల్లాలి నోయీ.........
"ఏలనే నవ్వం"ట! "ఏడుపేలే " యంట
పదిమంది ఆయింత పగలబడి నారంట
ఉత్తమ యిల్లాలి నోయీ.........
గాలెంట వోయమ్మ! దూళెంట వోయమ్మ!
యిరుగు పొరుగోరంత యిరగబడి నారంట!
ఉత్తమా యిల్లాలి నోయీ........
యీబూది ఒకతెట్టే! యీ పింకొకతె తట్టె,
నీలు సిలికె దొకతె! నిలిసి సూసే దొకతె!
ఉత్తమా యిల్లాలి నోయీ..........
సాటు నుండే యెంఖి సబకు రాజేశావ?
పదిమంది నోళ్ళలో పడమంట రాశావ?
ఉత్తమా యిల్లాలి నోయీ..........
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
Friday, June 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment