ఎఱ్ఱి సరదాలు

యెంకి వస్తాదాని
యెదురు తెన్నులు కాసి
దిగులుట్టి, తలదించి
తిరిగి సూసెతలికి...

యెంకి రావాలి నా యెదర నిలవాలి!
కులుకుతా నన్నేటో పలకరించాలి!

పిల్ల పొరుగూ రెల్లి
మల్లి రాలేదని
వొల్లంత వుడుకెత్తి
వొక్కణ్ణి పొడుకుంటే....

ఘల్లుమంటా యెంకి కాలు పెట్టాలి!
’యెల్లి వొచ్చా’ నంట యెంకి నవ్వాలి!

యెంకి కోపా లొచ్చి
యే దేశమో పోయి
కల్లోనా కాపడితె
కళ్ళూ తెరిసేతలికి

తళుకుమని యెంకి నా దరికి రావాలి!
’నిదర కాబో’ నంటు నింద నాడాలి!

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

గమనిక

బ్లాగు సార్వజనీక ఉపయోగార్థం వ్రాయబడినది, ఇందులోని విషయాల కాపీరైటు ఆయా పోస్టులలో చెప్పబడిన వారికి చెందినది అయి ఉండ వచ్చు, . ఏదైనా పోస్టులపై ఏమైనా అభ్యంతరాలున్నచో ఓ కామెంటు వ్రాయగలరు.

రసజ్ఞులు

వర్గాలు

తెలుగు వెలుగులు